ప్రముఖ హాలీవుడ్ నటి మళ్లీ వార్తల్లో నిలిచారు. మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో ఇటీవల ఏకంగా ఐదో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్‌తో ఈమె పెళ్లి జనవరిలో జరిగింది. జాన్‌కి కూడా ఇది ఐదో పెళ్లే. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. గతంలో ఏ బంధం నిలవలేదు కాబట్టి కనీసం ఈ బంధమైనా నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు కుటుంబీకులు కూడా సంతోషించారు. కానీ పెళ్లైన పన్నెండు రోజుల్లోనే ఇతన్ని కూడా వదిలేసిందట పమేలా. ఇందుకు కారణం ఇద్దరికీ ఒకరిపై ఒకరికి క్లారిటీ లేకపోవడమేనట. ఈ విషయాన్ని పమేలా మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నన్ను జాన్ ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించారు. సంతోషంగా ఉంది. మాకు ఒకరి జీవితం నుంచి మరొకరికి ఏం కావాలో తెలీడంలేదు. అది తెలిసే వరకు విడిగా ఉండాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాం’ అని తెలిపారు. పమేలాకు జాన్ ఎంతో కాలంగా తెలుసుకానీ ఎప్పుడూ అతనితో కలిసి ఉండలేదని పమేలా సన్నిహితులు తెలిపారు. READ ALSO: ప్రస్తుతం పమేలా కెనడాలో ఉన్న తన కుటుంబం వద్దకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. జనవరి 20న పమేలా, జాన్ కాలిఫోర్నియాలోని మలీబూలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైనట్లు అఫీషియల్ మ్యారేజ్ లైసెన్స్ లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sf3Je8
v
No comments:
Post a Comment