Wednesday, 19 February 2020

భారతీయుడు 2 షూటింగ్‌లో పెను విషాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి

మల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైనట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్‌ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ జరుగుతుండగా 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సోషల్ మీడియాలో కొంత మంది పోస్టు చేశారు. శంకర్ సినిమా షూటింగ్‌లో పెను విషాదం చోటు చేసుకుందని కామెంట్లు పెట్టారు. డైరెక్టర్ శంకర్ సహా గాయపడిన వారిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమల్‌హాసన్, కాజల్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను తెలుగులో ‘’గా విడుదల చేయనున్నారు. గతంలో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37FGQ9E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...