Sunday, 5 January 2020

Vijayashanti.. నన్ను తిట్టావ్, నీకు మనసెలా వచ్చింది: మహేష్ సాక్షిగా ‘మెగా’ రివేంజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో నవ్వుల పూవులు పూయించారు మెగాస్టార్ . ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో మెగాస్టార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. ఆయన స్పీచ్‌లో వాళ్ల రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తూనే అప్పట్లో తనను తిట్టిన విషయాన్ని గుర్తు చేసి ఫన్నీగా మెగా రివేంజ్ తీర్చుకున్నారు మెగాస్టార్. ‘‘ఈరోజు సండే.. నాతో ఆరోజు ‘సండే అననురా.. మండే అననురా ఎన్నడు నీదాన్నిరా’ అని అప్పట్లో నాకు మాట ఇచ్చి నా మనిషి నా బ్లాక్ బస్టర్స్ హిట్ పెయిర్ విజయశాంతి. మేం ఇద్దరం ఎలా ఉండేవాళ్లం అంటే హీరో హీరోయిన్లులా కాదండీ.. టీ నగర్‌లో మా ఇంటి ఎదురుగానే ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే.. మా ఇంటికి తను వచ్చేది తన ఇంటికి నేను వెళ్లేవాడిని. ఇక సినిమాల పరంగా 19-20 సినిమాలు కలిసి చేశాం. ఎంత హుషారుగా ఎంత సరదాగా చేసే వాళ్లం అంటే.. మళ్లీ మళ్లీ చేయాలనిపించేది. Read Also: అయితే విజయశాంతి నీ మీద నాకు చిన్న కోపం ఉందని చిరంజీవి అనగా.. ఎందుకు అని విజయశాంతి చిరంజీవి పక్కకు వచ్చి అడిగారు. ‘నాకంటే ముందు నువ్ పాలిటిక్స్‌కి వెళ్లావ్ కదా.. అప్పట్లో నన్ను అన్ని మాటలు అన్నావ్.. నీకు ఎలా మనసు వచ్చింది’ అని చిరంజీవి అనగడంతో స్టేజ్ అంతా నవ్వులతో నిండిపోయింది. వెంటనే విజయశాంతి చిరంజీవి చేతిలో నుండి మైక్ లాక్కుని ‘పంచ్ డైలాగ్ వేశారు.. ఈయన చేయి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో రఫ్ ఆడిస్తా.. రాజకీయం వేరే సినిమా వేరు.. మీరు నా హీరో.. నేను మీ హీరోయిన్ ఇద్దరం కలిసి 20పైగా సినిమాలు చేశాం. మళ్లీ ఇప్పుడు కూడా చేద్దామా.. ఆయన్ని అలా చూసి ఇరవై ఏళ్లు అయ్యింది. మీరు నన్ను ఎలా మరిచిపోతారు’ అంటూ మెగాస్టార్‌తో కలిసి ఫుల్ ఫన్ నింపారు. Read Also: అనంతరం స్పీచ్ కంటిన్యూ చేసిన మెగాస్టార్.. విజయశాంతిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె అందంపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘విజయశాంతి నిన్ను చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది.. రాజకీయాల్లోకి వెళ్లాను.. గ్లామర్, పొగరు, ఒగరు, ఫిగర్ అన్నీ తగ్గాయి అనుకుంటున్నారా? 15 ఏళ్ళ తరువాత వచ్చినా.. అదే గ్లామర్, అదే పొగరు, అదే ఫిగర్, అదే సొగసు. ఇంతకంటే ఏంటి విజయశాంతి. నువ్ చెక్కుచెదరలేదు.. నిన్ను చూస్తుంటే.. ఇక్కడ ఉండాల్సిన గుండె కిందకి జారుతోంది. ఇక్కడ నేను సీరియస్‌గా చెప్పదల్చుకున్నా.. రాజకీయం అంటే.. శత్రుత్వాన్ని పెంచుతోంది. సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది. నాకు విజయశాంతిపై ఉన్న ప్రేమ సెంటిమెంట్.. కొన్ని పరిస్థితుల్లో ఆమె నన్ను కామెంట్ చేసినా.. నాకు తిరిగి అనబుద్ది కాలేదు. ఒక్కమాట నిన్ను అన్నానా శాంతి చెప్పు. నిన్ను అనడానికి నాకు మనసు రాలేదు. ముందే అనని వాడిని వెనకాల అంటానా? ఈ సినిమాతో మేం ఇద్దరం మళ్లీ కలిశాం. ఈ గ్యాప్ మేం తెచ్చుకున్నది కాదు.. మహేష్ బాబు వల్ల మేం ఇక్కడ కలవగలిగాం. ఆమె ప్రేమ ఇన్నేళ్ల తరువాత ఆమె ప్రేమ గుండెను టచ్ చేసింది. నా ఫ్రెండ్‌ను నేను కలిసేలా చేసిన మహేష్‌కి చాలా థాంక్స్ అంటూ విజయశాంతిని వాటేసుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SUfTLx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...