Monday, 27 January 2020

‘v’లన్‌గా ‘నాని’ ఫస్ట్ లుక్.. కత్తెరతో గత్తర్లేపిన రాక్షసుడు

ఇన్నాళ్లు చాలా సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ నటనతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ‘వి’లన్‌ మారారు. రాక్షసుడి గెటప్‌లో హడలెత్తిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వి' చిత్రంతో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నాని ఫస్ట్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. గుబురు గెడ్డంతో మీసాలు మెలేసి చేతిలో రక్తంతో అంటిన కత్తెరతో ‘రాక్షసుడు’ అవతారంలో కనిపిస్తున్నారు నాని. హీరోగా నానికి ఇది 25 మూవీ కావడంతో V ఫస్ట్ లుక్‌తో ‘వి’లన్‌గా కత్తెరపట్టి గత్తర్లేపాడు నాని. ఇందులో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ‘రక్షకుడు’ లుక్ సోమవారం నాడు విడుదల చేయగా.. నేడు రాక్షసుడి లుక్‌ని విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు ఇంద్రగంటి. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబులకు జోడీగా అదితిరావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగామార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/314lDVc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...