మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి, మోహన్ బాబులతో తాను ప్రవర్తించిన తీరుపై నటుడు రాజశేఖర్ స్పందించారు. తన పోట్లాట నరేష్, ‘మా’, తన మధ్యేనని.. చిరంజీవి, మోహన్ బాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ట్విట్టర్ ద్వారా రాజశేఖర్ స్పష్టం చేశారు. అయితే, ‘మా’ కార్యక్రమంలో చిరంజీవి, మోహన్ బాబులకు గౌరవం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడి.. ఇప్పుడు ట్విట్టర్‌లో ఈ పిసుకుడు కార్యక్రమం ఏంటని కొంత మంది విమర్శిస్తున్నారు. రాజశేఖర్ ట్వీట్‌లో సారాంశం.. ‘‘ఈరోజు జరిగిందంతా నాకూ, నరేష్‌కు, ‘మా’కు మధ్య మాత్రమే. ఇక్కడ చెప్పిందంతా సరైంది కాదు. అందుకే నేను నిశ్శబ్దంగా ఒక పక్కన నిలబడి చూస్తూ ఉండలేకపోయాను. నాకూ చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు లేవు. నా వల్ల అతిథులకు అసౌకర్యం కలిగి ఉంటే దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, నాకు జరుగుతున్న దాని గురించి మాట్లాడటానికి ఇదే సరైన సమయం. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నేను రాజీనామా చేశాను. చిత్ర పరిశ్రమకు నా నుంచి ఏం సాయం కావాలన్నా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు జరిగిన దానిని చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి నాకూ మధ్య జరిగిన గొడవగా దయచేసి సృష్టించవద్దు. వారిద్దరి పైనా నాకు అపారమైన గౌరవం ఉంది. ‘మా’కు వారి సేవలు అవసరం. దయచేసి దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దు’’ అని రాజశేఖర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37sPCYB
v
No comments:
Post a Comment