Thursday, 23 January 2020

‘సవారి’ ట్రైలర్: భర్తను అలా చూసి నోరెళ్లబెట్టిన గీతా మాధురి

నందు, ప్రియాంక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సవారి’. ‘బందంరేగడ్’ షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సాహిత్ మోత్కూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాద్‌షా అనే గుర్రం, దాని యజమాని రాజు చుట్టూ తిరిగే కథతో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నందు పక్కా తెలంగాణ కుర్రాడి పాత్రలో నటించారు. ఆయన మేనరిజం, గెటప్ చాలా కొత్తగా ఉన్నాయి. రాజు పాత్రలో ఆయన జీవించినట్టు ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాలు చూస్తే అర్థమవుతోంది. డ్రాయర్‌లో బోల్డ్‌గా కనిపించారు. ఈ సినిమాలో బోల్డ్ కామెడీతో పాటు ఎమోషనల్ కంటెంట్, లవ్ కూడా ఉన్నాయి. Also Read: ఈ సినిమా ట్రైలర్ గురించి నందు భార్య, గాయని గీతామాధురి సోషల్ మీడియాలో స్పందించారు. ట్రైలర్‌లో భర్తను డ్రాయర్‌లో చూసి ఆశ్చర్యపోయారు. ట్రైలర్ చూస్తూ నోరెళ్లబెట్టారు. ‘‘లాస్ట్ లో నేను ఎందుకు అంత షాక్ అయ్యానో తెలియాలి అంటే పక్కాగా ఈ లింక్‌ను క్లిక్ చేయాలి. వామ్మో’’ అని ట్రైలర్ లింక్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతే కాదు, ఆమె ల్యాప్‌టాప్‌లో ట్రైలర్ చూస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. కాగా, ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. మోనిస్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RmfJeJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...