Monday, 27 January 2020

చనిపోయింది నేను కాదు రా నాయనా: తలబాదుకుంటున్న నటి

ప్రముఖ హిందీ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ అనే సీరియల్‌లో నటించిన సెజల్ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తెలియరాలేదు. అయితే సెజల్ శర్మ పేరుతో మరో బుల్లి తెర నటి కూడా ఉంది. అయితే చనిపోయిన నటి పేరు ‘’. మరోపక్క ‘’ అనే నటి కూడా ఉన్నారు. దాంతో సెజల్ శర్మ ఎవరో సరిగ్గా తెలీకపోవడంతో పలు మీడియా వర్గాలు ఇదే పేరుతో ఉన్న మరో నటి ఫొటోలు వాడేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. పలు వెబ్‌సైట్లలో తన ఫొటో చూసుకున్న సెజల్ శర్మ కంగుతిన్నారు. ఆమె బంధువులు, స్నేహితులు షాకై ఇంటికి ఫోన్లు చేస్తున్నారట. దాంతో వెంటనే సెజల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘హల్లో.. నా స్నేహితులు, ఫ్యా్న్స్‌కి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. సెజల్ శర్మ ఆత్మహత్యపై నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆత్మహత్యే మార్గం అని అనుకోకండి. సూసైడ్ అనేది ఎప్పటికీ సమస్యకు సమాధానం అవ్వదు. అయితే పలు మీడియా వర్గాలు పొరపాటున నా ఫొటోలు వాడేస్తున్నారు. దాంతో నా బంధువులు, సన్నిహితులు షాక్‌కు గురవుతున్నారు’ అని పేర్కొన్నారు. READ ALSO: ఆత్మహత్యకు పాల్పడిన సెజల్ శర్మ విషయానికొస్తే.. ఆమె ఎలాంటి ఒత్తిడిలో లేదని, ప్రేమలో విఫలం అవ్వడం వంటి సమస్యలు కూడా లేవని ఆమె తల్లి వాపోయారు. సెజల్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OkdMxF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...