Tuesday, 21 January 2020

మాజీ సీఎం కొడుకుతో నితిన్ డైరెక్టర్ సినిమా

నితిన్ హీరోగా నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నితిన్ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఈ చిత్రం బాగా ఉపయోగపడింది. ఈ సినిమా ద్వారా విజయ్ కుమార్ కొండా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ చేశారు. ఇది కూడా పర్వాలేదనిపించింది. ఆ తరవాత విజయ్ నుంచి మరో సినిమా రాలేదు. ఏం జరిగిందో తెలీదు కానీ ఆయన మకాంను శాండిల్‌వుడ్‌కు మార్చారు. మరోవైపు, మాజీ ప్రధానమంత్రి దేవే గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్ గౌడ సినిమా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘జాగ్వార్’ సినిమాతో ఈయన కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌కు కూడా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. ఆ తరవాత కన్నడలో రెండు సినిమాల్లో నటించారు నిఖిల్. ‘కురుక్షేత్ర’లో అభిమన్యుడు పాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి సోలో హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ఒకేసారి చిత్రీకరిస్తారు. బుధవారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నిఖిల్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘లహరి మ్యూజిక్’ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను అత్యుత్తమంగా, మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించాలని నిర్ణయించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RftkUV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...