Wednesday, 1 January 2020

భర్తతో శ్రియ ముద్దుల న్యూ ఇయర్.. విషెస్ అదిరిపోలా..!

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రియ ప్రస్తుతం తన భర్తతో కలిసి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొస్కీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2018 మార్చిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శ్రియ సినిమాలకు దూరమైపోయారు. తెలుగులో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తరవాత మరో సినిమాలో శ్రియ కనిపించలేదు. ప్రస్తుతం శ్రియ రష్యాలోనే ఉంటోంది. తన భర్తతో కలిసి దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. తన దాంపత్య జీవితం ఎంత బాగుందో అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇండియన్ ఫ్యాన్స్‌కు చూపిస్తూ ఉంటారు శ్రియ. కాగా, న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి శ్రియ అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా్గ్రామ్‌లో రెండు పోస్టులు పెట్టారు. వాటిలో ఒక పోస్ట్‌లో తన భర్తతో ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫొటోలు జత చేశారు. ఒక ఫొటోలో భర్త పెదాలపై శ్రియ ముద్దాడుతున్నారు. Also Read: మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అని పాట పాడుతూ శుభాకాంక్షలు తెలిపిన వీడియోను ఉంచారు. ఈ వీడియో చివరలో ఇద్దరూ పుచుక్ పుచుక్ అంటూ అభిమానులపై ముద్దుల వర్షం కురిపించారు. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని శ్రియ, ఆండ్రీ కోరుకున్నారు. మొత్తానికి ఈ ముద్దుల విషెస్ భలే ముద్దుగా ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36fl38R
v

No comments:

Post a Comment