Monday, 13 January 2020

లేడీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం.. కొరియన్‌ రీమేక్‌తో ప్రయోగం

ఇటీవల సినిమాల నిర్మాణం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ మరో డిఫరెంట్‌ మూవీకి రెడీ అవుతోంది. కొరియన్ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఓ బేబీతో సూపర్‌ హిట్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరో కొరియన్‌ సినిమా రీమేక్‌ మీద కన్నేసింది. పోలీసుల ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకుల కథతో తెరకెక్కిన మిడ్‌ నైట్‌ రన్నర్స్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఈ సంస్థ. పోలీష్ అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో ఓ కిడ్నాప్ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడటం ఈ సినిమా కథ. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నారు. Also Read: అయితే ఒరిజినల్‌ వర్షన్లో ఇద్దరు కుర్రాలు ఉంటే తెలుగు రీమేక్‌లో ఇద్దరు అమ్మాయిలు ఇలా ఓ కిడ్నాప్ కేసు పరిష్కరించేందుకు ప్రయత్సిస్తున్నట్టుగా మార్చారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ప్రధాన పాత్రలకు రెజీనా, నివేదా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాకు సుధీర్‌ వర్మ అయితే దర్శకుడిగా పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. స్వామి రారా, కేశవ, రణరంగం లాంటి థ్రిల్లర్‌లను తెరకెక్కించిన సుధీర్‌, ఈ సినిమాను పర్ఫెక్ట్ హ్యాండిల్ చేయగలడని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/372fN93
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...