టాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలకు విక్టరీ వెంకటేష్ పెట్టింది పేరు. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు బహుశా ఏ హీరో చేసి ఉండరు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా ఏదైనా పండించగల నటుల్లో వెంకీ మొదటి వరుసలో ఉంటారు. ‘గురు’ లాంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చేసి విజయం సాధించిన వెంకీ ఇప్పుడు మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే ‘నారప్ప’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాకు ‘నారప్ప’ రీమేక్. అక్కడ ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. వెంకీమామలో ప్లెజెంట్ లుక్‌లో కనిపించిన ఈ దగ్గుబాటి హీరో.. ‘నారప్ప’ కోసం తన లుక్‌ను మొత్తం మార్చేశారు. రౌద్ర రూపంలోకి వచ్చేశారు. ఇప్పటికే విడుదలైన ‘నారప్ప’ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకీ లుక్‌పై టాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నారప్ప’ షూటింగ్ బుధవారం ఉదయం అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైంది. హిందూపురం శివారులో బుధవారం తెల్లవారుజాము నుంచే షూటింగ్‌ను మొదలుపెట్టినట్టు సమాచారం. హీరో వెంకటేష్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురం చేరుకున్నారు. నగరంలోని లక్ష్మీనగర్‌లో ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నివాసంలో వెంకటేష్ బస చేశారు. మరి షూటింగ్ ముగిసేంత వరకు ఆయన జేసీ ఇంట్లోనే ఉంటారా? లేదంటే హోటల్‌కు వెళ్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. Also Read: కాగా, చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 15 రోజుల క్రితం తన యూనిట్‌తో అనంతపురం జిల్లాకు వెళ్లారు. లొకేషన్ల అన్వేషణలో భాగంగా ఉరవకొండలోని పలు ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టారు. చివరికి హిందూపురం శివారులో షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. వి.క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tFg3fy
v
No comments:
Post a Comment