Monday, 27 January 2020

జీవా ‘స్టాలిన్’లో నవదీప్ విలన్.. రిలీజ్ ఎప్పుడంటే!

రంగం ఫేమ్ హీరోగా నటించిన విడుదలకు రెడీ అయ్యింది. వైవిధ్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించిన జీవా నటించిన తాజా చిత్రం స్టాలిన్. అందరివాడు అనేది ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది. మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా.. నిర్మాతలు డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఈ చిత్రం భారీగా విడుదలకానుంది. ఇదే చిత్రం తమిళంలో సీరు పేరుతో విడుదలవుతుంది. రంగం చిత్రం తర్వాత ఆ స్థాయిలో తీయబడిన మాస్ చిత్రమిది. జీవా తన పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అందరికీ ఆప్తుడిగా మెలగుతూ చెడుపై పోరాటం చేసే పాత్ర ఆయనిది. ఇక నవదీప్ ప్రతినాయకుడిగా ఎంతగానో ఒదిగిపోయారు. కధానాయికలు తమ పాత్రలలో మెప్పిస్తారు. కధానాయిక రియా సుమన్ ఇప్పటికే తెలుగులో మజ్ను, పేపర్ బాయ్ చిత్రాల్లో నటించారు. 15 కోట్ల భారీ వ్యయంతో ఎక్కడ తగ్గకుండా కథ డిమాండ్‌కు అనుగుణంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో ఆడియోను విడుదల చేయనున్నాం. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు’ అని చిత్ర విశేషాలను పంచుకున్నారు నిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Gw0dGI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...