Monday, 13 January 2020

వామ్మో ఇది పైరసీకి బాబులా ఉందే.. టీవీలోనే ‘దర్బార్’ సినిమా ప్రసారం

ఎన్ని చర్యలు తీసుకున్నా పైరసీకి కెళ్లెం వేయలేకపోతున్నాం. భారీ బడ్జెట్ సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు విడుదలైన రెండో రోజే పైరసీకి గురవుతున్నాయి. మొన్న, నిన్న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘దర్బార్’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల హెచ్‌డీ ప్రింట్‌ పైరసీ వీడియోలు బయటికి వచ్చాయి. అయితే ఇప్పుడు పైరసీ 2.0ని మరో భూతం వచ్చింది. అదేంటంటే.. సినిమాలను ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ బస్సులలో, లోకల్ టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేసేస్తున్నారు. తమిళనాడులోని మధురైకి చెందిన ఓ లోకల్ టీవీ ఛానెల్‌లో ‘దర్బార్’ సినిమాను ప్రసారం చేయడం వివాదాస్పదంగా మారింది. ఫ్యాన్స్ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న సినిమాను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అరాచకానికి పాల్పడిన వారిపై తక్షిణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ కూడా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒకప్పుడు పైరసీ సినిమాలు బయటికి వస్తే డౌన్‌లోడ్ చేసుకుని ఎవ్వరికీ తెలీకుండా సినిమా చూసేవారు. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. READ ALSO: ఓపెన్‌గానే వీడియోలను, షూటింగ్‌లను సీక్రెట్‌గా షూట్ చేసేస్తున్నారు. ఈ పైరసీ భూతాన్ని అడ్డుకోవడానికి 2018- 2019 బడ్జెట్‌లో ఎంటర్‌టైన్మెంట్ రంగానికి సింగిల్ విండో ఆప్షన్ ఏర్పాటుచేశారు. ఎన్ని ఆప్షన్లు ఏర్పాటు చేసినా పైరసీని ఆపలేకపోతున్నారు. ఇటీవల తన సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైందని ఓ నటుడు ఫిలిం ఛాంబర్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్ద హీరోల సినిమాలకే రక్షణ లేకుండాపోయింది. ఇక వర్తమాన నటీనటులు, దర్శకులు, నిర్మాతలను ఎవరు ఆదుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2snzWqW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...