Friday, 3 January 2020

బాలయ్య హీరోయిన్ కేసును వాదిస్తున్న లాయరూ కామాంధుడే..!

ఏదైనా సమస్య వస్తే న్యాయవాదిని సంప్రదించి న్యాయం చేయాలని అడుగుతాం. కానీ నమ్మిన న్యాయవాది కూడా తప్పుడు వ్యక్తే అయతే. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు ఇదే పరిస్థితి ఎదురైంది. సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ మీటూ ఉద్యమానికి తెరలేపింది . ఆమెను స్ఫూ్ర్తిగా తీసుకుని ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. అయితే నానా పటేకర్ విషయంలో తనకు న్యాయం జరగాలని తనుశ్రీ ముంబయికి చెందిన నితిన్ సత్పుటే అనే లాయర్‌ను నియమించుకుంది. అతనిపై భారం వేసి కేసును అప్పగించింది. కానీ అతను కేసులో ఓడిపోయాడు. సరైన సాక్ష్యాలు లేనందున కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ విషయం పక్కన పెడితే.. నితిన్ సత్పుటే కూడా అలాంటివాడేనని తెలిసింది. ఓ మహిళా లాయర్ నితిన్‌పై కోర్టులో కేసు వేసింది. తన దగ్గరకు వచ్చి చెవిలో అసభ్యకరమైన పదజాలం వాడేవాడని, చాలా సార్లు దగ్గరికి రావడానికి ప్రయత్నించాడని పిటిషన్‌లో పేర్కొంది. గతంలోనూ అతనిపై ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిందట. READ ALSO: ఓ గార్డెన్ ఏరియాను పిల్లల మైదానంగా మార్చే కేసు విషయంలో నితిన్, సదరు మహిళా లాయర్ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ కేసు విషయంలో తప్పుకోవాలని నితిన్ అసభ్యకరంగా మాట్లాడేవాడట. దాంతో పోలీసులు నితిప్‌పై 354 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత తనుశ్రీ ఏమంటుందో వేచి చూడాలి. నందమూరి బాలకృష్ణతో కలిసి తనుశ్రీ ‘వీరభద్ర’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tmWoRd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...