Monday, 6 January 2020

ఛ.. ముద్దు సీన్లలో నటించే ఛాన్స్ రాలేదు: కోరికను బయటపెట్టిన స్టార్ సీనియర్ హీరో

చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు.. 60 ఏళ్ల వయసులో ముద్దు సీన్ల కోసం తెగ ఆరాటపడుతున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు . ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మలంగ్’. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో ఆదిత్య, దిశల మధ్య గాఢమైన ప్రేమను చూపించడానికి తెగ కిస్సింగ్ సీన్లను జొప్పించేశారు. దీని గురించి ఓ విలేకరి అనిల్ కపూర్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘మీతో పాటు నటించిన ఆదిత్య, దిశల మధ్య కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి కదా. మీకు ఆ ఛాన్స్ లేదని బాధపడుతున్నారా?’ అని అడిగారు. ఇందుకు అనిల్ బదులిస్తూ.. ‘ఇంట్లో నా కూతుళ్లు, భార్య ఉన్నారు. ఈ ప్రశ్నలు అడిగి నేను ఇంటికి వెళ్లగానే నన్ను చావగొట్టాలని మీరు కోరుకుంటున్నారా? నిజం చెప్పాలంటే నాకు కిస్సింగ్ సన్నివేశాల్లో నటించే అవకాశం రానందుకు బాధగానే ఉంది. సినిమాలో ఆదిత్య, దిశ బైక్ రైడ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా కుర్రాడిని అయివుంటే వారిలాగే నేనూ ఎంజాయ్ చేసేవాడిని’ అని తెలిపారు. ఇందులో అనిల్ కపూర్ పోలీసుగా విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కాబోతోంది. READ ALSO: ఇకపోతే ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీల అండర్ వాటర్ కిస్సింగ్ సీన్ హైలైట్‌గా నిలవనుందట. ఇందుకోసం హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇచ్చారు. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. అంతసేపు అండర్‌ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్‌ కెపాసిటీని పెంచేందుకు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. సింగిల్‌ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37LNhrR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...