మిస్ వరల్డ్ అయినప్పటికీ ఆమెకు ఇండస్ట్రీలో సాయం చేసిన వాళ్లు లేరు. నల్లగా ఉన్నావని వెక్కిరించినవారూ ఉన్నారు. అవన్నీ తట్టుకుని ఈరోజు గ్లోబల్ స్టార్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు. ఆమే . ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎవరి సాయం లేకుండా తన కాళ్లపై తాను నిలబడగలిగారు. అయితే తాను కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నేను సినిమాల్లోకి వచ్చాక హీరోలే హీరోయిన్లు డిసైడ్ చేస్తారు అని చెప్పేవారు. అయితే ఇప్పటికీ ఈ ట్రెండ్ ఉందనుకోండి. కానీ ప్రేక్షకులు మాత్రం హీరో, హీరోయిన్లు ఎవరు అన్నది పట్టించుకోవడంలేదు. కంటెంట్ ఉందా లేదా అనే చూస్తున్నారు. ఆడియన్స్‌లో ఆ మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను ‘ఫ్యాషన్’ సినిమా చేసినప్పుడు హీరోయిన్లు మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తారు అని చెప్పారు. ఆ తర్వాత ‘ఐత్రాజ్’ సినిమాలో నటిస్తే.. ఈ సినిమా చేయొద్దు అందరూ నిన్ను వేశ్యగానే చూస్తారు అని హెచ్చరించారు. నా ఇమేజ్ పాడవుతుందని భయపెట్టారు. ఏదైతే ఏంటి అని ఆ సినిమా చేసేశాను’’ READ ALSO: ‘‘నాకు నేర్పించేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనకు దీపిక పదుకొణె, ఆలియా భట్, కంగనా రనౌత్, విద్యా బాలన్ లాంటి నటీమణులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ‘ఇలాంటి కథలను చెప్పాలని అనుకుంటున్నాం. మేం ఎంత మంచి కథల్లో నటిస్తామంటే మీ అంతట మీరే థియేటర్లకు పరుగులు తీస్తారు’ అంటున్నారు. కానీ అలాంటి సినిమాలే నేను చేసినప్పుడు చాలా తక్కువ మంది అలాంటి సినిమాల్లో నటిస్తుండేవారు’’ అని తెలిపారు. READ ALSO: ఇక వర్క్ పరంగా ప్రియాంక గతేడాది ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రియాంక ఎలాంటి సినిమాలకూ సంతకం చేయలేదు. తన భర్తతో సమయం గడిపేందుకు అమెరికా వెళ్లారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38mbAxc
v
No comments:
Post a Comment