Wednesday, 22 January 2020

రష్మిక ఆస్తులు అంతా...! షాక్‌ అవుతున్న అభిమానులు

సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కన్నడ బ్యూటీ రష్మిక సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌ సాండల్‌వుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల ఈ భామ ఇంటి మీద ఐటీ రైడ్స్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఆ రైడ్స్‌ రష్మిక మీదే అంటూ వార్తలు వినిపించినా తరువాత అవి వారి కుటుంబ వ్యాపారాల లావాదేవిలకు సంబంధించి జరిగినవి కొట్టి పారేశారు. అయితే ఈ విషయంలో రష్మిక పీఆర్‌ ఎన్ని రకాలుగా క్లారిటీ ఇచ్చిన రకరకాల వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా కన్నడ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ రైడ్స్‌ సందర్భంగా రష్మిక పేరు మీద భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారన్నది ఈ వార్త సారాంశం. రష్మిక పేరు మీద దాదాపు 250 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది. Also Read: కన్నడలో కిరికీ పార్టీ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, `ఛలో` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్ సినిమాలతో ఆకట్టుకొని ఏకంగా సూపర్‌ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. అయితే ఇప్పటికే వరకు ఈ భామ చేసింది కేవలం పది సినిమాలు మాత్రమే. మరి పది సినిమాలతోనే రష్మిక 250 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టిందని షాక్ అవుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్‌ అవుతున్నా.. అవి ఎంత వరకు నిజం అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. Also Read: ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌, సుకుమార్‌ల సినిమాతో పాటు నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న భీష్మా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు కన్నడలో పొగరు, తమిళ్‌లో సుల్తాన్‌ సినిమాలు చేస్తోంది రష్మిక. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RDlnbq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...