Friday, 10 January 2020

జెర్సీ రీమేక్.. హీరో మూతి పగిలింది

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం ఆయన ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఛండీగఢ్‌లోని మొహాలి స్టేడియంలో జరుగుతోంది. అయితే షాహిద్ క్రికెట్ ఆడుతున్న సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా బంతి మూతికి తగిలింది. దాంతో మూతి దగ్గర చర్మం బాగా చిట్లిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని హాస్పటిల్‌కు తరలించారు. దెబ్బ గట్టిగా తగలడంతో ఏకంగా 13 కుట్లు పడ్డాయట. వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సజెస్ట్ చేశారు. ‘‘షాహిద్ ఇప్పుడు బాగానే ఉన్నారు. సన్నివేశం కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. READ ALSO: ఆ సమయంలో బంతి మూతికి తగిలింది. కింది పెదవి చిట్లి బాగా రక్తంపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. 13 కుట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయం తెలిసి షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ వెంటనే మొహాలికి బయలుదేరారు. భయపడాల్సిన పనిలేదు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గాయం పూర్తిగా తగ్గిన తర్వాతే షాహిద్ షూటింగ్‌లో పాల్గొంటారట. తెలుగు ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో మృణాల ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తండ్రి పంకజ్ కపూర్ ఇందులో సత్యరాజ్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Kwtl0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...