ఎన్ని మాటలు చెప్పినా సినిమా అదే వ్యాపారమే. అందుకే దర్శక నిర్మాతలతో పాటు సినీ రంగానికి చెందిన ప్రతీ ఒక్కరు సక్సెస్ వెంటే పరిగెడతారు. సినిమా సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి, అలాంటి టీంకే తిరిగి అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోలైన సక్సెస్ లేకపోవతే ఇక అంతే. అందుకే పెద్దగా ఫాంలో లేని నటీనటులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు రావటం కూడా కష్టమే. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు ఓ దర్శకుడు. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన భాస్కర్ తొలి సినిమా బొమ్మరిల్లును తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. తరువాత అల్లు అర్జున్ హీరోగా పరుగు మూవీతో ఓకె అనిపించినా ఆ సినిమా తరువాత భాస్కర్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. వరుస ఫ్లాప్‌లు ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్‌ను కష్టాల్లో పడేసింది. Also Read: దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. లాంగ్ గ్యాప్ తరువాత అఖిల్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్ కూడా అంతగా ఫాంలో లేకపోవటంతో ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలా లిమిటేషన్స్ పెట్టారు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడు రెమ్యూనరేషన్ కూడా తీసుకోవటం లేదట. ప్రస్తుతం ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేస్తున్న భాస్కర్, సినిమా సక్సెస్ అయిన తరువాత లాభాల్లో వాటా తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అఖిల్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a3VoCe
v
No comments:
Post a Comment