Sunday, 5 January 2020

అల్లు అర్జున్‌ కెరీర్‌ బెస్ట్.. అయినా..!

స్టైలిష్‌ స్టార్‌ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా . గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో పెద్ద చర్చే జరిగింది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో థియేటర్ల అడ్జస్ట్‌మెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తటంతో జనవరి 12న కాకుండా జనవరి 10నే సినిమాను రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. అయితే ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ కలగజేసుకొని సర్థి చెప్పటంతో రెండు సినిమాలు ముందుగా ప్రకటించిన డేట్స్‌కే రిలీజ్ అవుతున్నాయి. Also Read: లాంగ్ గ్యాప్‌ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీగా జరిగింది. బన్నీ కెరీర్‌లోనే ఇదే హయ్యస్ట్ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. ఓవర్‌సీస్‌తో కలిసి ఈ సినిమాకు దాదాపు 85 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగినట్టుగా ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నెంబర్‌ మహేష్ సరిలేరు నీకెవ్వరు కన్నా తక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, జయరామ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఆడియో సూపర్‌ హిట్ కావటంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. తమన్‌ మ్యూజిక్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే జనవరి 6న హైదరాబాద్‌లో భారీ మ్యూజికల్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్‌. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ulCXsn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...