Monday, 20 January 2020

ఆ నటి వల్ల నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేది: తండ్రి ఆవేదన

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో ప్రతీ విషయం వివాదాస్పదమవుతోంది. బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలో తెలీని వారంతా కంటెస్టెంట్లుగా వచ్చారని సల్మాన్ తలబాదుకుంటున్నారు. అయితే ఈ హౌజ్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లలో షెహనాజ్ గిల్, హిమాన్షి ఖురానాలు హైలైట్. వీరిద్దరూ బుల్లితెర నటీమణులు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అయితే బిగ్ బాస్‌లో పర్సనల్ గొడవలు పెట్టుకోకూడదు కాబట్టి ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే ఇటీవల షెహనాజ్ తండ్రి ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘‘బిగ్‌బాస్ హౌజ్‌లో నా కూతురు షెహనాజ్‌తో హిమాన్షి ఎప్పుడూ గొడవలు పడుతుండేది. షెహనాజ్‌కు పని దొరికినప్పుడల్లా హిమాన్షి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ఫోన్లు చేసి షెహనాజ్ గురించి తప్పుగా చెప్పేది. దాంతో వారు హిమాన్షి మాటలు నమ్మి నా కూతురికి ఎలాంటి పని ఇచ్చేవారు కాదు. హిమాన్షి తన చేతురాలా కెరీర్ నాశనం చేసుకుంది. కానీ షెహనాజ్ ధైర్యం కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉంది. తనకు ఛాన్సెస్ లేకపోవడంతో సింగింగ్ రంగంలోనైనా ఎదగాలని అనుకుంది. కానీ నా కూతురు షెహనాజ్ స్థానంలో మరొకరు ఉండి ఉంటే హిమాన్షి పెట్టిన టార్చర్‌కు కచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. షెహనాజ్‌ను నోటికొచ్చినట్లు తిడుతూ ఎన్నో మెయిల్స్ పంపేవారు. పంజాబీ ఇండస్ట్రీ మొత్తం నా కూతురిని బ్యాన్ చేసింది’’ అని వాపోయారు. READ ALSO: ఈ విషయం హిమాన్షికి తెలీడంతో ఆమె ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. షెహనాజ్ తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ మీ కూతురు నా వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని ఉంటే.. తనకు ఓ విషయం చెప్పండి. తనంతట తానే వివాదాల్లోకి వెళ్తుంది, ఆ తర్వాత డిస్టర్బ్ అవుతుంది. మీ కూతురు ఓ కెనడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ మాట చెప్పింది. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్లే తను పాపులర్ అయిందని, ఆ తర్వాతే తనకు పని దొరికేదని చెప్పింది. కాబట్టి ఈసారి ఇంటర్వ్యూలు ఇచ్చేముందు కాస్త ఆలోచించండి’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G6BWXK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...