మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరో కొద్ది రోజలుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. చాలా రోజుల తరువాత రాజా ది గ్రేట్‌తో హిట్ కొట్టిన తరువాత మళ్లీ గాడి తప్పాడు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ. ఇప్పటికే వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు రవితేజ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను కూడా ప్రారంభించాడు రవితేజ. Also Read: గతంలో తనతో డాన్ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రవితేజ ఫిట్‌గా రెడీ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసం ఫిట్‌గా కనిపించేందుకు కండలు పెంచుతున్నాడు రవితేజ. తాజాగా రవితేజ వర్క్ అవుట్స్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12.5 కేజీల డంబుల్‌తో వర్క్ అవుట్స్ చేస్తున్న రవితేజ ఫిట్‌నెస్ చూస్తే కుర్ర హీరోలకు కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాడు. Also Read: ఈ సినిమాలో రవితేజకు జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FJrQvS
v
No comments:
Post a Comment