Tuesday, 21 January 2020

భర్త మంచోడే కానీ విడిపోవాల్సి వచ్చింది: శ్వేతా బసు ప్రసాద్

కొన్ని ప్రేమకథలు అస్సలు అర్థంకావు. అందులోనూ సెలబ్రిటీల ప్రేమకథలు అస్సలు అర్థంకావు. వారి జీవితాల్లో ఏం జరిగాయో మనకు తెలీదు కానీ మీడియాకు చెప్పేటప్పుడు మాత్రం ఎక్కడా దొరక్కుండా మాట్లాడేస్తుంటారు. నటి కూడా ఈ కోవకు చెందినవారే. 2018లో ప్రముఖ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని శ్వేత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే రోహిత్‌లో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో శ్వేత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను, రోహిత్ ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. నేను పెళ్లయ్యాక కూడా నటిస్తానంటే ఒప్పుకున్నాడు. నాకు నా కెరీర్‌కు చాలా సపోర్ట్ చేశాడు. అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. నేను అతని అభిమానిని. ఇద్దరం కలిసి ఐదేళ్లు నిజాయతీగా ప్రేమించుకున్నాం. కానీ ఈ బంధం రద్దు చేసుకుని ఫ్రెండ్స్‌గానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మేమిద్దరం పరస్పరం చర్చించుకుని తీసుకున్న నిర్ణయం. అయితే మరొకరితో ప్రేమలో పడటానికి నాకే అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం గురించి ఇప్పుడు నేను ఆలోచించదలచుకోలేదు. నా ఫోకస్ అంతా కెరీర్‌పైనే పెట్టాలని అనుకుంటున్నాను. ప్రేమ అనేది దానంతట అదే జరిగితే బాగుంటుంది’ అని తెలిపారు. READ ALSO: ‘కహానీ ఘర్ ఘర్ కీ’ అనే సీరియల్‌తో బాల నటిగా పరిచయమైన శ్వేతా బసు.. తెలుగులో ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ‘ఏకడా..’ అంటూ శ్వేత చెప్పిన క్యూట్ డైలాగ్స్‌కి కుర్రకారు ఫిదా అయిపోయింది. కానీ ఆమె మరీ బొద్దుగా ఉండటంతో సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ‘కళావర్ కింగ్’ అనే సినిమాలో నటించినా అది విజయం సాధించలేదు. సినిమా అవకాశాలు లేక, బతకడానికి డబ్బు లేక మానాన్ని అమ్ముకోవాలని అనుకున్నారు. అది కాస్తా మీడియాలో వైరల్ అవడంతో ఆ పనిని వదిలేసి బాలీవుడ్‌కి వెళ్లిపోయారు. అక్కడ చిన్న చిన్న సినిమాలు చేశారు. చివరిగా శ్వేత ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ అనే సినిమాలో వదిన పాత్రను చేశారు. ప్రస్తుతం శ్వేత చేతిలో ఏ సినిమాలు లేవు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3axaVuB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...