Friday, 3 January 2020

అల్లు అర్జున్‌ డాన్స్‌ మూమెంట్‌కు పేరు పెట్టిన కూతురు అర్హ

ఈ సంక్రాంతికి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆడియో సూపర్‌ హిట్ కావటంతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా భారీగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా ఇది బన్నీ కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంలో ప్రమోషన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఓ మై గాడ్‌ డాడీ పాట సమయంలో తన పిల్లలిద్దరినీ రంగంలోకి దింపిన అల్లు అర్జున్‌ తాజాగా తన కూతురితో తీసిన మరో వీడియోను రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలాక్స్‌ అవుతున్న బన్నీ పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు. Also Read: కూతురితో రాములో రాములో పాటలోని తన స్టెప్‌ గురించి మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్‌: నాన్న సినిమా పేరేంటి? అర్హ: మ్‌...అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌: అందులో నాన ఎల్లో కలర్‌ జాకెట్‌ వేసుకోని సాంగ్ చేస్తాడు కదా అది ఏం సాంగు. అర్హ: రాములో రాములో అల్లు అర్జున్‌: మ్ రాములో రాములో అందులో ఏ స్టెప్‌ చేస్తాను అర్హ: దోస స్టెప్‌ అల్లు అర్జున్‌: ఏ స్టెప్‌ (నవ్వుతూ) అర్హ: దోస స్టెప్‌ అల్లు అర్జున్‌: దోస స్టెప్‌ వెయ్యి ఒకసారి అర్హ: ఇలా మొత్తం తిప్పి ఫాస్ట్‌గా తిప్పుతావ్‌ ఇలా సరదా సరదాగా సాగిన ఈ సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, జయరామ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, మురళీ శర్మ, సచిన్‌ కేడ్కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QGTwq9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...