Wednesday, 1 January 2020

హవ్వ.. బెడ్ రూం విషయాలు కూడా చెప్పేస్తున్న స్టార్ కపుల్

బాలీవుడ్ పవర్‌కపుల్ , రణ్‌‌వీర్ సింగ్ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యా్న్స్ ఉన్నారు. వీరిద్దరి గురించి ఏ విషయం బయటికి వచ్చినా ఫ్యాన్స్‌కు అదో బ్రేకింగ్ న్యూసే. వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఆత్రుత చెందుతుంటారు. అయితే ఈసారి ఈ స్టార్ కపుల్ తమ బెడ్ రూం విషయాలను కూడా పంచుకోవడం మొదలుపెట్టారు. అయితే వారంతట వారే ఈ విషయాలను చెప్పుకోవడం లేదనుకోండి. బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్ అడిగిన ప్రశ్నకు దీపిక మింగ లేక కక్కలేక సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ కార్తిక్ ఏమని అడిగాడంటే.. ‘ మీరు రోజూ ఉదయాన్నే ఏ వైపు నుంచి మంచం దిగుతారు’ అని అడిగాడు. ఈ ప్రశ్న వినగానే దీపిక సిగ్గుపడినా ఎట్టకేలకు సమాధానం చెప్పింది. ‘నేను రోజూ కుడి వైపు నుంచి మంచం దిగుతాను’ అని చెప్పింది. ఈ ప్రశ్న అడిగినప్పుడు పక్కనే భర్త రణ్‌వీర్ సింగ్ కూడా ఉన్నాడు. అసలే రణ్‌వీర్ హైపర్ ఆక్టివ్. అందులోనూ దీపిక అంటే పంచ ప్రాణాలు. తన భార్య కొంగు పట్టుకునే తిరుగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు రణ్‌వీర్ మౌనంగా ఉంటాడా. READ ALSO: దీపిక కుడి వైపు దిగుతాను అని సమాధానం చెప్పగానే రణ్‌వీర్ మైక్ అందుకుని.. ‘అవును దీపిక కుడి వైపు నుంచే మంచం దిగుతుంది. ఎడమ వైపు నుంచైతే నేను అంత త్వరగా మంచం దిగనివ్వనుగా..’ అంటూ రొమాంటిక్ ఆన్సర్ ఇచ్చారు. దాంతో దీపికకు కాస్త అసౌకర్యంగా అనిపించినా తెగ సిగ్గుపడిపోయింది. వదిలేస్తే ఇంకేం మాట్లాడతాడో అని భయపడి ‘టాపిక్ మార్చు’ అని ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇదంతా ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో జరిగిన డ్రామా. రణ్‌వీర్ సమాధానానికి వేడుకకు హాజరైనవారంతా తెగ నవ్వేసుకున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35iEhc6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...