సినీ ప్రముఖులను దేవుళ్లుగా భావిస్తుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో. ఇక హీరోయిన్లనైతే పై నుంచి దిగి వచ్చిన దేవతలకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. అమ్మాయిల సంగతి అటుంచితే.. ఇష్టమైన హీరోయిన్ కనపడితే అబ్బాయిలు వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అభిమానం మితిమీరితే వారిని ముట్టుకునేందుకు కూడా యత్నిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ కుర్ర హీరోయిన్ సారా అలీ ఖాన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రోజూ సారా జిమ్‌కి వెళ్తుందని తెలిసి ఆమె కోసం ఫ్యాన్స్ జిమ్ బయట ఎదురుచూస్తుంటారు. సారా కూడా వారితో సెల్ఫీలు దిగుతూ ఉంటుంది. రోజూలాగే ఈరోజు కూడా సారా జిమ్‌కి వెళ్లింది. అయితే జిమ్ నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడున్న కొందరు అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగాలనుకున్నారు. ఇందుకు సారా కూడా ఒప్పుకున్నారు. అయితే ఓ యువకుడు సారా వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పోన్లే అని సారా కూడా అతనికి చెయ్యి ఇచ్చింది. అంతే చెయ్యి దగ్గరికి లాగేసుకుని ముద్దు పెట్టేశాడు. దాంతో సారా షాకయ్యారు. ఏమీ అనలేక థ్యాంక్యూ చెప్పేశారు. అక్కడే ఉన్న బాడీగార్డ్ ఆ యువకుడిని పక్కకు పంపేశారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. READ ALSO: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి అయిన సారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే అగ్ర కథానాయికకు ఉన్నంత పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో సారాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘కేదార్‌నాథ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సారా. ఆ తర్వాత ‘సింబా’తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు సారా చేతినిండా సినిమాలే ఉన్నాయి. సారాకు ఉన్న క్రేజ్ ఇప్పుడిప్పుడు వచ్చిన మరే స్టార్ కిడ్‌కీ లేదనే చెప్పాలి. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/307DMRj
v
No comments:
Post a Comment