‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన రంగస్థల నటుడు విజయ్ కుమార్‌కు నందమూరి బాలకృష్ణ సాయం చేసి మరోసారి తన దయాగుణం చాటుకున్నారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతోన్న విజయ్ కుమార్ భార్యకు బసవతారకం హాస్పిటల్‌లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారని బాలకృష్ణపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై విజయ్ కుమార్ స్పందించారు. తన భార్యకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన విషయం వాస్తవమేనని విజయ్ కుమార్ చెప్పారు. వైద్యం ఎలా చేయించాలి అని వాకబు చేసినప్పుడు ఏలూరులోని తన స్నేహితులు అక్కడి ఆశ్రమ హాస్పిటల్‌లో చేర్పించారన్నారు. అక్కడ చికిత్స చేయించిన తరవాత హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్ ప్రసిద్ధి కాబట్టి కీమో థెరపీ చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం కీమో థెరపీ జరుగుతోందని తెలిపారు. ఈ విషయం గురించి ఇప్పటి వరకు తనకు, తన స్నేహితులకు తప్ప ఎవ్వరికీ తెలీదని.. అలాంటిది ఈ వార్తలు ఎందుకు పుట్టుకొచ్చాయో అర్థంకావడంలేదని విజయ్ కుమార్ అన్నారు. తాను స్వతహాగా ఎన్టీఆర్ అభిమానిని అని, రంగస్థలంపై ఆయన వేషాలే వేసి కీర్తి గడించానని చెప్పారు. తాను చిన్న వయసులో ఎన్టీఆర్‌ను కలిశానని, కానీ బాలకృష్ణను ఒక్కసారి కూడా కలవలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ అంటే తనకు చాలా అభిమానమని.. ఒకవేళ తాను సహాయం అడిగివుంటే ఆయన చేసేవారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2unIizj
v
No comments:
Post a Comment