సినీ ప్రముఖులకు సంబంధించిన ఏ విషయం బయటికి వచ్చినా ప్రేక్షకులకు అదెంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ సెలబ్రిటీలు మాత్రం అలాంటి విషయాలు బయటికి చెప్పకపోవడమే మంచిది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఇక తప్పదు అనుకున్నప్పుడు అలాంటి విషయాలు బయటికి వస్తుంటాయి. తాజాగా గోవా బ్యూటీ తన జీవితంలో తొలి అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలి ముద్దు ఎవరితో అన్న ప్రశ్నకు ఇలియానా ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు. ‘నా తొలి ముద్దు ఓ హీరోతో’ అన్నారు. ఆయన ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ‘దేవదాస్’. ఇద్దరికీ ఇది తొలిసినిమానే. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇందులో రామ్, ఇలియానా లిప్ కిస్ సీన్ ఒకటి ఉంది. ఇతర ప్రశ్నలకు ఇల్లూ బేబీ చెప్పిన సమాధానాలు. READ ALSO: తొలి ఉద్యోగం? ఓ హోటల్ కోసం మ్యాగజైన్‌కు ఫోటోషూట్ ఇచ్చాను. తొలి సంపాదన? ఐదేళ్ల వయసులో ఓ ఫొటోషూట్ చేశాను. అప్పుడే ఎంతో డబ్బు అందుకున్నాను. తొలిసారి ఏ మూవీ సెట్‌లో అడుగుపెట్టారు? నేను సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నా వయసు 18 ఏళ్లు. తొలిసారి వెళ్లిన విదేశం? లండన్ READ ALSO: ఫస్ట్ టైం స్టార్ అని ఎప్పుడు ఫీలయ్యారు? నాకు స్టార్ అన్న పదం నచ్చదు. ఇప్పటికీ నాకు నేను స్టార్ అనుకోను. తొలిసారి ఎప్పుడు ఆటోగ్రాఫ్ ఇచ్చారు? ఓసారి యాడ్ ఫిలిం చేస్తుంటే ఓ వ్యక్తి వచ్చి ఆటోగ్రాఫ్ అన్నాడు. నేనెవరో కూడా మీకు సరిగ్గా తెలీదు కదా అన్నాను. బహుశా అతను తాగి వచ్చినట్లున్నాడు. తొలిసారి చీర ఎప్పుడు కట్టుకున్నారు? బహుశా గోవాలో మోడలింగ్ చేస్తున్నప్పుడు ర్యాంప్ వాక్ కోసం కట్టుకున్నట్లు గుర్తు. READ ALSO: మీ ఫస్ట్ క్రష్? చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఓ అబ్బాయి ఉండేవాడు. అతనికి లైన్ వేసేదాన్ని. కానీ అతనికి నేను నచ్చలేదు. తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అది పూర్తిగా వ్యక్తిగతం. కానీ ప్రేమ అనేది చాలా అందమైనది. మీరు వాడిన తొలి ఫోన్? ఇది నాకు బాగా గుర్తు. నోకియా బ్రాండ్‌కు చెందిన ఎన్ సిరీస్ ఫోన్. దానికి రొటేటింగ్ కెమెరా ఉండేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35Mmb2z
v
No comments:
Post a Comment