కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ధనుష్. విలక్షణ పాత్రలతో, అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లతో ఆకట్టుకుంటున్న ధనుష్ ఇటీవల పటాస్ అనే మరో మాస్ యాక్షన్ సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తమిళ్‌లో పటాస్ అనే పేరుతో రిలీజ్ కాగా తెలుగు వర్షన్‌కు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. లోకల్ బాయ్ కథా కథనాలు కూడా అదే స్టైల్‌లో సాగుతాయి. Also Read: గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కూడా ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒక హీరోయిన్‌గా సీనియర్ నటి స్నేహ నటించగా, మరో హీరోయిన్‌గా మెహరీన్ పిర్జాదా నటించింది. తెలుగు నటుడు నవీన్ చంద్ర ఈ సినిమాలో విలన్ రోల్‌లో కనిపించటం విశేషం. ఈ సినిమాలో స్నేహ పలు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించింది. See Photo Story: ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులను అలరించిన పటాస్, లోకల్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూద్దాం. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GvuwxD
v
No comments:
Post a Comment