Tuesday, 21 January 2020

సారీ చెప్పనంటున్న రజినీ.. సాయం చేస్తానంటున్న మంత్రి

ఎవరెన్ని చేసినా తాను మాత్రం సారీ చెప్పేది లేదని అంటున్నారు సూపర్‌స్టార్ . ఇటీవల ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌పై రజినీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ద న్యూస్‌ మినిట్‌ కథనం మేరకు ఈ నెల 14న జరిగిన తుగ్లక్‌ పత్రిక 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీ తందై పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించినట్టుగా ద న్యూస్‌ మినిట్‌ పేర్కొంది. అంతేకాదు ఆ సమయంలో ఒక్క తమిళ మేగజైన్‌ మాత్రం ఈ వార్తను ప్రచురించిందని ప్రభుత్వం ఈ వార్త బయటకు రాకుండా జాగ్రత్త పడిందని రజనీ వ్యాఖ్యనించినట్టుగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడ్డారు. పెరియార్‌పై, ఆయన నిర్వహించిన కార్యక్రమాలపై రజనీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. READ ALSO: అంతేకాదు రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్‌ గౌరవానికి భంగం కలిగించారంటూ కోవై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రజినీ స్పందిస్తూ.. ‘నాపై ఎవరెన్ని కేసులు పెట్టినా నేను సారీ చెప్పను. నేనేమీ కల్పించి మాట్లాడలేదు. మీడియాలో ఏం రాశారో వాటి గురించే మాట్లాడాను. కావాలంటే ఆధారాలు చూపిస్తాను’ అన్నారు. See Photo Story: దీనిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను రజినీకాంత్‌ తరఫున మాట్లాడటంలేదు కానీ.. ఆయన పెరియార్ గురించి ఏం చెప్పారో అదంతా నిజమే. ‘తుగ్లక్’ అనే మ్యాగజైన్‌లో చో రామస్వామి పెరియార్ గురించి పబ్లిష్ చేశారు. రజినీకాంత్ ఇదే మాటపై నిలబడితే.. న్యాయస్థానంలో ఆయన తరఫున నేను వాదిస్తాను’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Rz1GBm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...