Saturday, 4 January 2020

పారితోషికంలో తలైవాని మించిపోయాడు..ఆ డబ్బుతో మినీ బాహుబలి తీసేయొచ్చు

కోలీవుడ్‌లో రజినీకాంత్, కమల్ హాసన్‌ను మించిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది దళపతి విజయ్. అతనికి తమిళనాడులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘విజిల్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌క సంతకం చేయబోతున్నాడు. తమిళనాడుకు చెందిన అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ విజయ్‌తో మరోసారి కలిసి పనిచేయబోతోంది. గతంలో సన్ పిక్చర్స్.. విజయ్‌తో కలిసి ‘సర్కార్’ సినిమా తీసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అందుకే మరోసారి విజయ్‌తో కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు ప్రముఖ నిర్మాత కళానిధి మారన్. అయితే తన 65వ సినిమాకు విజయ్ తీసుకునే పారితోషికం విషయం గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాకు విజయ్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవాలని అనుకుంటున్నారట. అంటే ఈ విషయంలో తలైవా రజినీకాంత్‌ను విజయ్ బీట్ చేసినట్లే. రజినీ నటించిన ‘దర్బార్’ సినిమాకు 90 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. కానీ విజయ్ ఆయన కంటే మరో పది కోట్లు ఎక్కువ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ రకంగా చూసుకుంటే తమిళనాడు చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో విజయ్ అవుతాడు. READ ALSO: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించనున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నారు. 2020 దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశఆరు. ఇటీవల కర్ణాటకలోని శిమోగా ప్రాంతంలోని జైలులో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZOcizW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...