Friday, 10 January 2020

టీవీ సీరియల్స్ కోసం మహేష్ బాబు.. తోడుగా యాంకర్ ప్రదీప్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ మూడ్‌లో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 11న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తరవాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా మహేష్ బాబు మెరుస్తున్న సంగతి తెలిసిందే. పలు వాణిజ్య ప్రకటనల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను మహేష్ రోజూ పలకరిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ సీరియల్స్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. తెలుగులో ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జీ తెలుగు మూడు సరికొత్త సీరియల్స్‌ని ప్రేక్షకుల కోసం సిద్ధం చేసింది. Also Read: వెంకట్ శ్రీరామ్, వర్షా హెచ్‌కే ప్రధాన పాత్రలు పోషించిన ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌.. ఆషికా గోపాల్ పడుకునే లీడ్ రోల్‌లో నటించిన ‘త్రినయని’ సీరియల్.. యామిని, జయాకవి, ప్రణయ్, వినయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘తూర్పు పడమర’ సీరియల్ త్వరలో మొదలు కాబోతున్నాయి. ఈ సీరియల్స్ విశేషాల కాన్సెప్ట్ వీడియో కోసం మహేష్ బాబు తొలిసారి జీ తెలుగుతో కలిసి పనిచేశారు. ఈ మూడు సీరియల్స్‌ని సూపర్ స్టార్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోని హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో చిత్రీకరించారు. ఇందులో మహేష్‌తో పాటు మూడు సీరియల్స్ నటీనటులు, యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించారు. ఈ కాన్సెప్ట్ వీడియో ఈ సంక్రాంతికి జీ తెలుగులో ప్రసారం కానుంది. అలాగే ప్రేక్షకులు ఈ వీడియోను తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న థియేటర్లలో వీక్షించవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37Riha4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...