Monday, 13 January 2020

బండ్ల గణేష్‌కు అంత పారితోషికమా.. ఏం చేశాడని?

‘మేం మగాళ్ల మాటలు అస్సలు వినంగా’.. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కాసిన్ని నవ్వులు పంచారు ప్రముఖ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. సినిమాలో రైలు ఎపిసోడ్ కామెడీ పరంగా చాలా హైలైట్‌గా నిలిచిందని చాలా మంది అన్నారు. అయితే ఈ ఎపిసోడ్ సినిమాకు అంత ప్లస్ పాయింట్ కాదని కొందరి వాదన. ఈ సంగతి అటుంచితే.. కేవలం పది నిమిషాల పాత్ర కోసం తీసుకున్న పారితోషికం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఆయన ఈ సినిమా కోసం ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారట. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెసే గెలుస్తుందని లేకపోతే తన గొంతును బ్లేడ్‌తో కోసుకుంటా అంటూతనని తాను ఫూల్‌ని చేసుకున్నారు గణేష్. ఆ తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలవడంతో గణేష్ మీడియాకు తన ముఖం చూపించలేకపోయారు. అయితే ఈ ఎపిసోడ్‌నే సినిమాలో వాడి కామెడీని పండించేందుకు ప్రయత్నించారు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే బండ్ల గణేష్ కామెడీ సినిమలో అంతగా పండలేదని పలువురి అభిప్రాయం. ఆయన కోసం ఇరవై లక్షలు ఖర్చుపెట్టి వేస్ట్ చేశారని అంటున్నారు. READ ALSO: ఇటీవల జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రేక్షకులు బండ్ల గణేష్‌ను ఓ ఆట అడుకున్నారు. మాట్లాడటానికి వేదికపైకి వచ్చిన గణేష్‌ను బ్లేడు గణేష్ అంటూ వెక్కిరించారు. దీంతో మొదట కాస్త ఫస్ట్రేట్ అయినా ఆ తరవాత కూల్‌గా చిరంజీవి, మహేష్ బాబుపై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తరవాత తన ‘బ్లేడు’ దగ్గరకి వచ్చారు. ‘‘ఎన్నో సంవత్సరాల తరవాత మా అక్క విజయశాంతి గారు, మెగాస్టార్ గారు, సూపర్ స్టార్ మహేష్ గారు, బండ్ల గణేష్ గారు ఒకే వేదికపై ఇంత అద్భుతం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తరవాత నన్ను దయచేసి బ్లేడు గణేష్ అని ఎవరూ అనొద్దు. బండ్ల గణేష్ అనే పిలవండి. ఏదో తెలిసో తెలియకో టంగ్ స్లిప్పయింది. అందరూ కలిసి నన్ను ఎర్ర బీప్ అంటున్నారు. కాబట్టి ఇక నుంచి బండ్ల గణేష్‌గానే మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. READ ALSO: ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత స్పందన ఈ సినిమాకు వస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ మహేష్ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FP3alG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...