బాలీవుడ్ సూపర్‌స్టార్ మీడియా ముందు ఏం చేసినా రచ్చ రచ్చైపోద్ది. ఎందుకంటే రణ్‌వీర్ వయసులో పెద్దవాడే కానీ చేసే పనులన్నీ చిన్నపిల్లాడిలా ఉంటాయి. అందుకే మీడియా కూడా రణ్‌వీర్ చేసే పనులను హైప్ చేస్తూ ఉంటుంది. తాజాగా రణ్‌వీర్ చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అందరూ చూస్తుండగా ఏకంగా ఓ అభిమాని చొక్కా చించేశాడు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ వ్యక్తి రణ్‌వీర్‌కు వీరాభిమాని. అతనికి రణ్‌వీర్ అంటే ఎంత ఇష్టమంటే.. వీపుపై ‘రణ్‌వీరియన్’ అనే టాటూను కూడా వేయించుకున్నాడు. READ ALSO: ఆ వ్యక్తి రణ్‌వీర్‌ను కలిసి టాటూ ఉందని చెప్పడంతో ఎంతో ఎగ్జైట్ అయిపోయాడు. అందరూ చూస్తుండగా మీడియా ముందు అతని చొక్కా మరింత కిందికి లాగేస్తూ తన పేరును టాటూ వేయించుకున్నాడు అని గర్వంగా చూపించాడు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రణ్‌వీర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణ్‌వీర్ ‘83’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. 1983లో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ ఎలా గెలిచింది అన్న నేపథ్యంలో ఈ సినిమాను కబీర్ సింగ్ తెరకెక్కించారు. దీంతో పాటు రణ్‌వీర్ ‘జయేష్‌భాయ్ జొర్దార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FAcedN
v
No comments:
Post a Comment