Thursday, 16 January 2020

రాములో రాములా.. `అల వైకుంఠపురములో` మరో రికార్డ్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ అయిన అల వైకుంఠపురములో సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే వరుస రికార్డులు సాధిస్తున్న ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. అల వైకుంఠపురములో ఆడియో సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌ హిట్ అయ్యింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా పాటలు యూట్యూబ్‌ను ఊపేశాయి. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సత్తా చాటిన ఈ పాటలు సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్‌ ప్లే చేశాయి. పక్కా మాస్ బీట్‌లో సాగిన రాములో రాములా పాట ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరింది. Also Read: యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి సత్తా చాటింది ఈ పాట. 146 మిలియన్ల (14 కోట్ల 60 లక్షల)కు పైగా వ్యూస్‌ సాధించిన ఈ పాటకు పది లక్షలకు పైగా లైక్స్ రావటం విశేషం. పార్టీ మూడ్‌లో సాగే ఈ పాటలో బన్నీ వేసిన హాఫ్‌ కోట్‌ స్టెప్‌ (దోశ స్టెప్‌) కూడా చాలా ఫేమస్‌ అయ్యింది ఇలా అన్ని కలిసి రాములో రాములా పాటను సూపర్‌ హిట్ చేశాయి. Also Read: అల్లు అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. బన్నీ కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంతో ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్టుగా సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్‌ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్న అల వైకుంఠపురములో బన్నీ కెరీర్‌లో బెస్ట్ సినిమాల సరసన నిలుస్తుందని భావిస్తున్నారు విశ్లేషకులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sAUKva
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...