Friday, 24 January 2020

అనుష్క ‘నిశ్శబ్దం’ విడుదల వాయిదా.. కారణం అదేనా!

దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘భాగమతి’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. క్రాస్ ఓవర్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌ం, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో ఈ చిత్రం రూపొందుతోంది. జనవరి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, విడుదల తేదీ మారుతున్నట్టు తాజాగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, విడుదల తేదీ మార్పునకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. Also Read: 31వ తేదీన ‘అశ్వథ్థామ’ విడుదలవుతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ తరవాత ఫిబ్రవరి 7న సమంత, శర్వానంద్ ‘జాను’.. అనంతరం ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం క్రేజీ మూవీస్. బహుశా వీటితో పాటు విడుదల చేస్తే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఫిబ్రవరి 20కి ‘నిశ్శబ్దం’ విడుదలను వాయిదా వేసి ఉండొచ్చు. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే మూగ అమ్మాయి పాత్ర పోషించారు. మాధవన్ ఒక కీలక పాత్రలో నటించారు. అంజ‌లి, షాలిని పాండే, సుబ్బరాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల, మైకేల్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో న‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38C9o4K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...