Thursday, 2 January 2020

మాతో సినిమా తీసే దమ్ము ఏ దర్శకుడికైనా ఉందా: యువ హీరో ఛాలెంజ్

తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు బాలీవుడ్ కుర్ర హీరో కార్తిక్ ఆర్యన్. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్‌తో కలిసి నటించాలని ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. దీపిక నటించిన తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’లోని ఫొటోను, తాను ఆడిషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫొటోను పక్క పక్కన పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా ఇద్దరితో సినిమా చేయడానికి ఏ దర్శకుడికైనా దమ్ము ఉందా?’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు దీపిక స్పందిస్తూ.. ‘కానీ ఆ పాత ఫొటోలు ఎందుకు పోస్ట్ చేశావ్’ అని ప్రశ్నించింది. ఇందుకు కార్తిక్.. ‘ఓం శాంతి ఓం’లోని డైలాగ్ కొడుతూ.. ‘ఎందుకంటే ఆ ఆశ అప్పటినుంచే ఉంది’ అన్నాడు. ఇందుకు దీపిక కూడా ఇదే సినిమాలోని డైలాగ్ కొడుతూ.. ‘స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది’ అని పేర్కొంది. అలా కాసేపు దీపిక, కార్తిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా సంభాషించుకున్నారన్నమాట. వీరి సంభాషణ చూసి ఏ దర్శకుడైనా వీరితో సినిమా తీసేందుకు ముందుకు వస్తాడో లేదో చూడాలి. READ ALSO: ప్రస్తుతం కార్తిక్ ‘భూల్ భులయ్యా 2’, ‘దోస్తానా 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలకు సీక్వెల్స్. మరోపక్క దీపిక తాను నటించిన ‘ఛపాక్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37uyyBz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...