Sunday, 1 December 2019

Tamannaah: ఆ యువరాజుకు పడిపోయిన మిల్కీ బ్యూటీ

తైమూర్ అలీ ఖాన్.. ఈ పేరు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిపోయింది. బాలీవుడ్ పవర్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రేక్షకులు అందరికీ తైమూర్ చాలా ఫేవరేట్. ఒక్కమాటలో చెప్పాలంటే సైఫ్, కరీనాల కంటే తైమూర్ ఫ్యాన్స్ జాబితానే ఎక్కువ. ఇప్పుడు ఈ జాబితాలో మిల్కీ బ్యూటీ కూడా చేరిపోయారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా తైమూర్ గురించి మాట్లాడారు. ‘తైమూర్ పేరు వినగానే మీకు ఏమనిపిస్తుంది’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తమన్నా సమాధానం ఇస్తూ.. ‘తైమూర్ చాలా క్యూట్‌గా ఉంటాడు. చూడటానికి లిటిల్ మఫిన్‌లా ఉంటాడు. నాకు తెలిసి తాను యువరాజు అని తైమూర్‌కి కూడా తెలిసే ఉంటుంది’ అని తెలిపారు. తమన్నానే కాదు ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్ సహా ఎందరో సెలబ్రిటీలు ఈ బుల్లి నవాబుకి ఫిదా అయిపోయారు. తైమూర్‌ పుట్టగానే పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు తైమూర్‌కు మూడేళ్లు. ఈ మూడేళ్లలో ముంబయికి చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లు తైమూర్‌కి సంబంధించిన కొన్ని లక్షల ఫొటోలు తీసుంటారంటే నమ్ముతారా? అంతేకాదు కేరళలోని ఓ మార్కెట్‌లో తైమూర్ అలీ ఖాన్ పేరుతో బొమ్మలు కూడా అమ్ముడుపోతున్నాయి. ఈ బుల్లి నవాబ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్‌కు ఇంతటి ఫాలోయింగ్ లేదు. మున్ముందు ఇలాగే కొనసాగితే తైమూర్‌పై నెగిటివ్ ప్రభావం ఎక్కడ పడుతుందోనని సైఫ్, కరీనా భయపడుతున్నారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తైమూర్‌ని బోర్డింగ్ స్కూల్‌కి పంపించేయాలని అనుకుంటున్నట్లు కరీనా ఓ సందర్భంలో తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33G6ZmH
v

No comments:

Post a Comment