Wednesday, 11 December 2019

యూట్యూబ్ నా బాబుదేం కాదు: యాంకర్‌కు దిమ్మతిరిగే జవాబిచ్చిన రష్మి

ప్రముఖ యాంకర్ ఎక్కడికి వెళ్లినా.. ఆమెను సుడిగాలి సుధీర్ గురించే ఎక్కువగా అడుగుతుంటారు. సుధీర్, రష్మిల జంటకు ఫ్యాన్స్ మామూలుగా లేరు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. కానీ వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా ఫ్యాన్స్, మీడియా ఊరుకోదు. తాజాగా రష్మికి ఓ యాంకర్‌ నుంచి సుడిగాలి సుధీర్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ‘రష్మి అని గూగుల్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా వెంటనే ఆ తర్వాత కనిపించే పేరు సుడిగాలి సుధీర్. అదీకాకుండా చాలా షోలలో సుధీర్ ఎప్పుడూ ఒకే మాట చెప్తుంటాడు. నేను రష్మిని దాదాపు ఆరేళ్ల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు అన్నారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌కు శుభం కార్డు పడేదెప్పుడు?’ అని అడిగారు. ఇందుకు రష్మి సమాధానం ఇస్తూ.. ‘అది మీరు షో చూస్తుంటే అర్థమవుతుంది. షోలు ఇంకా నడుస్తున్నప్పుడు అప్పుడే శుభం కార్డు ఎలా వేస్తామండి’ అన్నారు. అయినా ఆ యాంకర్‌కు సరైన సమాధానం దొరకలేదేమో. రష్మిని కాస్త రెచ్చగొట్టారు. ‘నేను చెప్పేది షోకు శుభం కార్డు పడాలని కాదండి. మీ ఇద్దరి గురించి వస్తున్న రూమర్స్‌కి. కనీసం ఇప్పుడైనా మీరు సమాధానం చెప్పాలనుకుంటున్నారా’ అని దబాయించారు. ఇక రష్మికి ఒళ్లుమండినట్లుంది. తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘లేదండీ. ఇప్పుడు కూడా నేనేమీ ఆన్సర్ ఇవ్వాలనుకోవడం లేదు. షోలో మా ఇద్దరి గురించి ఓ ట్రాక్ నడుస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఏంటి. జనాలు కూడా ఎంజాయ్ చేస్తు్న్నారు. యూట్యూబ్, మీడియా ఛానెల్స్ నా బాబువి కావు. కాబట్టి నేనెందుకు ఫీలవ్వాలి. మా గురించి ఎవరో ఏదో రాసుకుంటుంటే మాకేంటి? పాపం వాళ్లు కూడా బతకాలి కదా. ఇప్పుడు నేను ఒక్కమాటలో సమాధానం ఇచ్చేస్తే వాళ్ల పొట్టలు కొట్టినదాన్ని అవుతాను. కాబట్టి నేను ఎందరికో అన్నం పెడుతున్నాను అనుకుంటాను’ అని ఆన్సర్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ch1MB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...