Monday, 2 December 2019

బిడ్డ పుట్టాక సెక్స్ సమస్యలు వచ్చాయ్: నటి షాకింగ్ కామెంట్స్

పిల్లలు పుట్టాక తల్లిదండ్రులకు వారే సర్వస్వం అవుతారు. వారి కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. కానీ బిడ్డ పుట్టడం వల్లే తనకు తన భర్తకు గొడవలు వచ్చి విడిపోయామని అంటున్నారు హాలీవుడ్ నటి . ‘ది రియల్ హౌస్‌వైఫ్ ఆఫ్ అట్లాంటా’ అనే షోలో ఈ విషయాన్ని నిస్సిగ్గుగా వెల్లడించారు. కెన్యా.. మార్క్ అనే నటుడ్ని 2017లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి పండంటి ఆడపిల్ల పుట్టింది. కానీ 2019లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు కారణం తెలిస్తే షాకవుతారు. పాప పుట్టినప్పుడు వీరిద్దరూ తమ బిడ్డను అపురూపంగానే చూసుకున్నారు. అయితే రాత్రివేళల్లో పాపను ఉయ్యాలలో కాకుండా తమ వద్దే పడుకోబెట్టుకునేవారు. దాంతో తమ ఇద్దరికీ సెక్స్‌లో పాల్గొనడం కుదరలేదట. పాప ఎక్కడ నిద్రలేస్తుందోనని భావించి ఇద్దరూ వేరుగా నిద్రపోయేవారట. దాంతో తమ దాంపత్య జీవితంలో సెక్స్ విషయంలో గొడవలు వచ్చాయని కెన్యా వెల్లడించారు. ఈ విషయంలోనే ఇద్దరూ విడిపోవాలని అనుకున్నారు. అయితే తమ బిడ్డను మాత్రం ఇద్దరూ సమానంగానే చూసుకుంటున్నారు. పాప తమ జీవితంలోకి రావడం వల్ల సెక్స్ లైఫ్ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో స్వీట్ మొమెంట్స్‌ని ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం విన్నాక ఓ విలేకరి కెన్యాను షాకింగ్ ప్రశ్న అడిగారు. ‘ఎన్నిసార్లు మీరు మీ భర్తతో సెక్స్‌లో పాల్గొన్నారు’ అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు కెన్యా సమాధానం చెప్పలేదు. ‘ఈ విషయంలో నేను సమాధానం చెప్పదలచుకోలేదు’ అని చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడే తన భర్తతో సెక్స్‌ విషయంలో మనస్పర్థలు వచ్చాయని అన్నారు. ఏడు నెలల గర్భం ఉన్నప్పుడు పొట్ట పెరుగుతోందని తన భర్త తిట్టేవాడని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LwiZ43
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...