Tuesday, 10 December 2019

‘నేను హీరోనే, కానీ మా ఆవిడ ఆ హీరో కోసం పడి చస్తుంది’

కిచ్చా కన్నడలో పెద్ద స్టారే కావచ్చు. కానీ ఆయన భార్య మాత్రం మరో హీరో కోసం పడి చస్తుందట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుదీప్ నటించిన మూడో హిందీ సినిమా ‘దబాంగ్ 3’. ఇందులో ఆయన బల్లీ సింగ్‌ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుదీప్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గురించి మాట్లాడారు. ‘నేను హృతిక్ రోషన్‌తో సినిమా చేస్తున్నానని తెలిస్తే అందరికంటే ముందుగా సెట్స్‌కు వచ్చేది నా భార్యే. తను హృతిక్‌కు వీరాభిమాని. ఆమె కోసమే నేను హృతిక్ నటించిన తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’ పది సార్ల కంటే ఎక్కువగా చూశాను. ఒకవేళ సినిమాకు తీసుకెళ్లకపోతే నన్ను బెదిరించేది. నేను తీసుకెళ్లకపోతే తన స్నేహితులతో వెళ్లిపోయేది. నేను తొలిసారి ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. నాకు హృతిక్ అతని డ్యాన్స్ చాలా నచ్చింది. స్క్రీన్‌పై హృతిక్ రోషన్ ఎప్పుడు డ్యాన్స్ చేసినా నా భార్య నా చెయ్యి పట్టుకుని గిచ్చేది. నేను కూడా హీరోనే కదా అని మనసులో తిట్టుకునేవాడిని. అలా ‘కహో నా ప్యార్ హై’ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది’ అని తెలిపారు. సల్మాన్ ఖాన్, సుదీప్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమా క్రిస్మస్‌కి విడుదల కాబోతోంది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో సుదీప్‌ను సల్మాన్‌కు సమానంగా చూపించారు. క్లైమాక్స్‌లో జరిగే ఫైటింగ్‌ సీన్‌లో సల్మాన్, తాను జంతువుల్లా కొట్టుకున్నామని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38qY4c6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...