Friday, 13 December 2019

సిక్స్‌ ప్యాక్‌లో యంగ్ హీరో.. ఫ్యామిలీ సినిమాలో యాక్షన్‌ హీరో లుక్‌!

సుప్రీం హీరో హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతి రోజూ పండగే. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి. తాజాగా సినిమాలోని ఓ యాక్షన్‌ సీన్‌కు సంబందించిన స్టిల్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఇప్పటి వరకు సినిమాను ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ చేసిన చిత్రయూనిట్ ఈ స్టిల్‌తో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్‌ను రివీల్ చేశారు. Also Read: షర్ట్‌ లేకుండా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ బల్కీ బాడీతో సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు. అంతేకాదు వీపు మీద ఉన్న ఓం ట్యాటు ఫోకస్‌ అయ్యేలా డిజైన్‌ చేసి ఈ స్టిల్ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌కు కూడా పుష్కలంగా ఉంటాయని తెలియజేసేలా ఉంది. తన బల్కీ లుక్‌ ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌, ఆ ఫిజిక్‌ సాధించేందుకు తనకు సహకరించిన కోచ్‌, ట్రైనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతి రోజు పండగే సినిమాలో సాయి తేజ్‌కు జోడిగా రాశీఖన్నా నటిస్తుండగా కీలక పాత్రలో సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కనిపించనున్నాడు. Also Read: ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడ్డ సాయి చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించాడు. ఈ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ మెగా హీరో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PhtIBt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...