Saturday, 7 December 2019

నూర్‌ భాయ్‌ మృతి.. విషాదంలో మెగా హీరోలు

హైదరాబాద్‌ మెగా అభిమానులకు సుపరిచితుడైన వ్యక్తి నూర్‌ మహ్మద్‌. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఫ్యామిలీ అభిమానిగా కొనసాగుతున్న నూర్‌ భాయ్‌.. పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మెగా కుటుంబానికి మద్ధతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నూర్‌ భాయ్‌ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌లో మెగా హీరోలకు మద్ధతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించటం, మెగా అభిమానుల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించటం లాంటి అంశాల్లో నూర్‌ భాయ్‌ ఎప్పుడూ ముందే ఉండేవాడు. అందుకే మెగా హీరోలు ఆయన్ను కుటుంబ సభ్యుడిగా భావించేవారు. అలా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి మరణించటంతో మెగా అభిమానులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆయన మృతితో ఈ రోజు జరగాల్సి కార్యక్రమాలను రద్ధు చేశారు. ఈ రోజు అలవైకుంఠపురములో టీజర్‌కు సంబంధిచిన అప్‌డేట్‌ ఈ రోజు ఇస్తున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించారు. అయితే నూర్‌ భాయ్‌ మృతి సందర్భంగా ఎనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ధృవ సినిమా రిలీజ్‌ అయి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు ప్లాన్‌ చేసిన సెలబ్రేషన్స్‌ను కూడా క్యాన్సిల్‌ చేసినట్టుగా మెగా అభిమానులు ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/354FrIY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...