Saturday, 14 December 2019

`చావు కబురు చల్లగా` చెపుతున్న యంగ్ హీరో

ఆర్ఎక్స్‌ 100 సినిమా సెన్సేషన్‌ సృష్టించిన యంగ్ హీరో తరువాత ఆ స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయాడు . ఇటీవల 90 ఎంఎల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరోకు ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చింది. గీతా ఆర్ట్స్‌ లాంటి బిగ్‌ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు కార్తికేయ. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో కార్తికేయ హీరోగా నటిస్తున్నాడు. శనివారం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాకు చావు కబురు చల్లాగా అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. Also Read: భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఈ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొత్త సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న యంగ్ హీరోలకు బ్రేక్‌ ఇస్తున్న గీతా ఆర్ట్స్‌ 2 సంస్థ ఈ సినిమాతో తన కెరీర్‌ను కూడా గాడిలో పెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కార్తికేయ. Also Read: ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qRpDdN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...