Tuesday, 24 December 2019

‘నేను ట్రాన్స్‌జెండర్, అందుకే సెక్స్ సీన్లలో నటించలేకపోయా’

ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాజం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తోంది. వీళ్లు సినీ ఇండస్ట్రీలోనూ రాణిస్తు్న్నారు. అనే ట్రాన్స్‌జెండర్ బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా మోడల్‌గా రాణిస్తోంది. ఇప్పుడు ఈమె నటించడం కూడా మొదలుపెట్టింది. ‘యే హై జస్ట్ మండి’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందట. ఆ సమయంలో చాలా అసౌకర్యానికి గురయ్యానని మీడియా ద్వారా వెల్లడించింది. ‘నేను ఈ వెబ్ సిరీస్ స్టోరీ విన్నప్పుడు నటించాలని అనుకున్నాను. కానీ సెక్స్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా అసౌకర్యానికి గురయ్యాను. నేను పర్సనల్‌ లైఫ్‌లో బోల్డ్‌గా ఉండొచ్చు. కానీ ఇలాంటి సన్నివేశాల్లో మాత్రం నటించే టైప్ కాదు. కానీ నటి అన్నాక ఏదేనా చేయాల్సిందేనని తెలుసుకున్నాను. ఈ వెబ్ సిరీస్‌ సీమా అనే యువతి తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్‌తో ఉంటుంది. ఇందులో నేను కరీనా అనే వేశ్య పాత్రలో కనిపిస్తాను. అయితే ఇందులో నటించడానికి నేను ఇతర నటీమణులను స్ఫూర్తిగా తీసుకోలేదు. నేను ట్రాన్స్‌జెండర్‌ను. అలాంటి పాత్రలో నటించే అవకాశం నాకు వచ్చినప్పుడు నేను వేరొకరిని స్ఫూర్తిగా తీసుకోలేను’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2s7c1Mp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...