Tuesday, 3 December 2019

నిఖిల్‌కి బంపర్ ఆఫర్.. సుకుమార్, అల్లు అరవింద్ కాంబోలో కొత్త సినిమా

‘అర్జున్ సురవరం’ చిత్రంతో సిద్దార్థ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదే జోష్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో ఛాన్స్ కొట్టేశాడు నిఖిల్. టాలీవుడ్ బడా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కబోయే చిత్రంలో హీరోగా క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడు నిఖిల్. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 2015లో సుకుమార్ కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించి కుమార్ 21 f చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిన్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సుమారు నాలుగేళ్ల తరువాత సుకుమార్, సూర్య ప్రతాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు గీతా ఆర్ట్స్‌ ద్వారా అల్లు అరవింద్ భాగస్వామ్యం కావడం.. అర్జున్ సురవరంతో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్ర అఫీషియల్ అనౌన్స్ మెంట్‌తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మెగా హీరోలతో పాటు బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మించి మంచి విజయాల్ని అందించిన ఘనత జిఏ 2 పిక్చర్స్ కి ఉంది. ఇప్పుడు నిఖిల్ కు సైతం అద్భుతమైన విజయం ఈ సంస్థనుంచి వస్తుందని ఆశిస్తున్నారు. నాగచైతన్య తో హండ్రెడ్ పర్సంట్ లవ్, నానితో భలే భలే మగాడివోయ్, విజయ్ దేవరకొండతో గీత గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలు జిఏ2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందించారు. ఇక ఇప్పుడు తొలిసారిగా నిఖిల్ తో చేస్తున్న సినిమా కూడా భారీ విజయం అందుకుంటుందనే ధీమాగా ఉన్నారు. జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ సమర్పణలో, సుకుమార్, బన్నీ వాసు లాంటి నిర్మాతలతో కలిసి వర్క్ చేస్తుండడంతో... నిఖిల్ కెరీర్ మరో కీలక మలుపు తీసకుంటుందని కాన్ఫిడెంట్‌గా నమ్ముతున్నాడు. ఈ సినిమా నిఖిల్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Peb0JE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...