Thursday, 26 December 2019

షాకింగ్‌: రాజ్‌ తరుణ్‌కు అంత తక్కువ రెమ్యూనరేషన్‌ ఇచ్చారా..?

వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్న యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ తాజాగా ఇద్దరి లోకం ఒకట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రాజ్‌ తరుణ్‌ కెరీర్‌కు బూస్ట్ ఇస్తుందనుకున్న సినిమా నిరాశపరచటంతో ఈ యంగ్ హీరో కెరీర్‌ మరింతగా ఇబ్బందుల్లో పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూ్‌స్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాకు రాజ్‌ తరుణ్‌ అతి తక్కువ పారితోషికం అందుకున్నాడట. హీరోగా సక్సెస్‌ అయ్యాక 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్‌ అందుకున్నాడు రాజ్‌ తరుణ్‌. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న రాజ్‌ తరుణ్‌కు కేవలం 10 లక్షల పారితోషికం మాత్రమే ఇచ్చాడట నిర్మాత దిల్ రాజు. Also Read: ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను రాజ్‌ తరుణ్‌తో తీయాలనుకోలేదు. ఈ సినిమాను మహేష్‌ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ తొలి చిత్రంగా తెరకెక్కించాలని భావించాడు దిల్ రాజు. సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు కూడా. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో అశోక్‌ స్థానంలో రాజ్‌ తరుణ్‌ను తీసుకొని సినిమాను రూపొందించాడు. బడ్జెట్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించిన దిల్ రాజు పారితోషికాలు కూడా అదే స్థాయిలో ఇచ్చాడట. ఈ సినిమాను టర్కీష్ మూవీ `లవ్‌ లైక్స్‌ కోఇన్సిడెన్సెస్‌` అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించాడు. రాజ్‌ తరుణ్‌ సరసన షాలినీ పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జీఆర్‌ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా తరువాత రాజ్‌ తరుణ్‌ చేయబోయే ప్రాజెక్ట్ ఇంకా ప్రకటించలేదు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2t1s66k
v

No comments:

Post a Comment