Wednesday, 25 December 2019

రాజకీయవేత్తతో నాకు సంబంధం అంటగట్టారు: నటి ఆండ్రియా ఆవేదన

సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువగా బయటికి చెప్పుకోరు. ఎందుకంటే అందరూ వారిని అర్థం చేసుకునేవారు ఉండరు. కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటి ఆండ్రియా జెరీమియాకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఓ సందర్భంలో విఫలమైన తన ప్రేమ కథ గురించి చెప్పడంతో దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారట. పైగా రాజకీయాల్లో ఉన్న ఓ నటుడితో తనకు సంబంధం అంటగట్టారని ఆండ్రియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకం ఒకటి రాశాను. అందులో అన్నీ నేను రాసిన పద్యాలే ఉంటాయి. ఓసారి బెంగళూరులో జరిగిన లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్లాను. అక్కడ అందరూ రచయితలే ఉన్నారు. నేను నా పుస్తకంలోని పద్యాలు చదివి వినిపిస్తుంటే ఎవరి గురించి రాశారు అని కొందరు అడిగారు. నా మాజీ ప్రియుడి గురించి అని చెప్పాను. ఆ సమయంలో నేను సెలబ్రిటీని అన్న విషయం మర్చిపోయి ఓ సాధారణ అమ్మాయిలా నా ప్రేమకథను వివరించాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత నా గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను పదేళ్ల క్రితమే ఈ పుస్తకం రాశాను. కానీ నేను అన్నీ బయటపెట్టడం వల్ల అది నాపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను’’ READ ALSO: ‘‘ అందుకే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. త్వరలో నేను రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను. ఈ పుస్తకం నా మాజీ ప్రియుడి గురించి కాదు. నా గురించి. కాకపోతే ఇందులో తొలిసారి నేను ప్రేమలో ఓడిపోయిన విషయాలు, నేను కన్న కలలు ఉన్నాయి. నా ప్రేమ గురించి చెప్పగానే చాలా మంది ఓ రాజకీయ నాయకుడితో సంబంధం అంటగట్టారు. నాకు ఎలా స్పందించాలో తెలీలేదు. ఊహించి రాసే వార్తలపై ఏమని స్పందిస్తాం. రాజకీయాల్లో ఉన్న ఓ సినీ నటుడితో నాకు సంబంధం అని చదవగానే ఏంటిది అని షాకయ్యాను’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MteWG0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...