Sunday, 22 December 2019

నా భార్య ప్రియాంక విలువైన కానుకిచ్చింది.. దాన్ని పోగొట్టుకోలేను: నిక్ జొనాస్

పవర్ కపుల్ , నిక్ జొనాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రజలకే కాదు ఎందరో సినీ ప్రముఖులకు కూడా ఈ జంట అంటే ఎంతో ఇష్టం. ఇటీవల వీరిద్దరూ తమ తొలి పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇటీవల ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్ తన భార్య గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రియాంక.. నిక్‌కి ఓ అపురూపమైన కానుక ఇచ్చారట. అదేంటో తెలుసా.. డైమండ్ ఉంగరం. నిశ్చితార్థం సమయంలో ప్రియాంక.. నిక్ వేలికి విలువైన డైమండ్ ఉంగరాన్ని తొడిగిందట. అయితే ఆ ఉంగరం అంటే తనకు ప్రత్యేకమని, దానిని చూసినప్పుడల్లా జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుందని నిక్ తెలిపారు. ‘నాకు ప్రియాంక ఓ ఉంగరం కానుకగా ఇచ్చింది. ఈ రింగ్‌ని చూసినప్పుడల్లా జీవితంలో నేనేదో సాధించేశానన్న ఫీలింగ్ కలుగుతుంది. దానిని అస్సలు పోగొట్టుకోలేను. ఒకవేళ దానిని చేజార్చుకున్నానంటే నన్ను నేను కోల్పోయినట్లే. ఎందుకంటే నేను జీవితాంతం కలిసి బతకాలి అనుకున్న అమ్మాయి ఇచ్చిన కానుక అది’ అని వెల్లడించారు నిక్. ఇటీవల నిక్, ప్రియాంక కలిసి లాస్‌ఏంజెల్స్‌లో 140 కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే. అక్కడే తమ తొలి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారట. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే ఇటీవల ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో నటించారు ప్రియాంక. తన తర్వాతి హిందీ సినిమాల గురించి ఇంకా ప్రకటించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ze2Ky7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...