అక్కినేని వారి ఇంటి పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని సోదరుడు అక్కినేని వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం ఐశ్వర్యతో చెన్నైలో ఘనంగా జరిగింది. అంగరంగవైభవంగా సాగిన ఈ నిశ్చితార్థ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. నాగార్జున, అమల, అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ, నాగసుశీలతో ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా ఈ అక్కినేని వారి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు అఖిల్. ఈ సందర్భంగా సోదరుడు ఆదిత్యకు విషెష్ అందించారు. అయితే ఈ ఫ్యామిలీ ఫొటోలో అక్కినేని కోడలు, నాగ చైతన్య క్యూట్ వైఫ్ సమంత మిస్ కావడంతో సమంత ఎక్కడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే సమంత షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ వేడుకకు హాజరుకాలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే అఖిల్ షేర్ చేసిన ఈ నిశ్చితార్థ వేడుక ఫొటో అవుతుండగా.. మరి నీ పెళ్లి ఎప్పుడు అఖిల్ అంటూ అప్పట్లో క్యాన్సిల్ అయిన పెళ్లిని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sm9aP4
v
No comments:
Post a Comment